Sunday, November 15, 2015

!! పరిణామం !!

పక్షులు స్వేచ్చగా ఎగరడం నేర్చుకున్నాయి
మొక్కలు పువ్వులు పూయడం నేర్చుకున్నాయి
చేపలు సముద్రం ఈదడం నేర్చుకున్నాయి
అయిదులక్షలేండ్లు అడుగులేసీ
మనిషి
నేటికి నేర్వగలిగిందొక నెత్తుటిభాష

అంతరిక్షంలో అడుగుపెడుతూ
అంతరాల అగాథాల్లోకి జారిపడుతూ
ద్వేషాన్నీ దాటలేని దుస్థితి
ప్రేమను పంచలేని దైన్యం

ప్చ్!!
మనిషి
సుఖంవైపు కాక
స్వచ్ఛతవైపు పరిణమించాల్సింది

6 comments:

Padmarpita said...

నిజమేఅ... అలా స్వచ్చత వైపు పయనిస్తే మనిషి, అంతకన్నా కావలసింది ఏముంది. బాగుంది మీ కవిత

Bharathi said...

Nice poetry Naveen.. Happy to find your blog, and I am a new follower of your blog now Expecting many more poems..

Bolloju Baba said...

great poem mithramaa

నవీన్ కుమార్ said...

Thank you Padmarpita garu, Bharati akka and Bolloju Baba garu :)

వెంకట రాజారావు . లక్కాకుల said...

బుధ్ధి వక్రించి చెడువైపు బోవు చుండ
స్వఛ్ఛతల వైపు పయనించ సాధ్య మగున ?
మనిషి ద్వేషాన్ని దాటి ప్రేమను వరించ
వట్టి మాటలు _ కవిత శభాష్ నవీన !

Anonymous said...

బాగుంది