Wednesday, May 30, 2012

నేనొస్తున్నా..

విరామమెరుగని అడ్డంకులతో
వెక్కిరించే ఓ విధీ,
వెరవక నీ మెడలు వంచగ
వస్తున్నానిక చూసుకో....

Saturday, May 5, 2012

నా ఎద గానం..

మాఘ మాసపు నులివెచ్చని తొలికిరణం నీవు
మౌనవీణను శ్రుతి చేసిన తడి తాకిడి నీవు
యేటిగట్టున ఎదురుచూసే యల కోకిల నేనైతే
ఎదమాటున వినిపించే మధుర గానం నీవు ..
                               ...Naveen Kommineni

Wednesday, April 18, 2012

నా చెలియా...

కదిలివచ్చిన కలల శిల్పమా..
మదిని మెరిసిన మంచుముత్యమా
ప్రణయ పాటముల పసిడికావ్యమా
కాటు వేసి నువు కల్లగాకుమా..

Tuesday, April 10, 2012

నువ్వు లేక సగమైన నేను..

ఆమనెందుకు నా ఎద అగ్నికాహుతి అవుతుంటే
వెలుతురెందుకు నా గుండెల చీకటలముకుంటుంటే
మోడువారిన హృది లోపలి మూలుగు వినిపిస్తోందా??
వలపు దీపమారినట్టి వాసన అనిపిస్తోందా??

మట్టిలాంటి మనిషినేను మాణిక్యముగ మార్చినావు..
చీడ పట్టిన చెట్టు సిరిగంధముగా చేసినావు
బాసలన్నీ మరచినావో భారముగా నను తలచినావో
బంధమును కడు బాధ చేసి ఒంటరిగా నను విదిచినావు!!!