Thursday, March 22, 2018

!! ప్రయాణం !!

నిన్నట్లాగే
ఒక అపరిచిత దారిలో నడుస్తూ వచ్చాను

పగిలిన పల్లేరుకాయలు గుచ్చుకున్నా
కొండల అంచులు సంగీతం వినిపించాయి
కొంతదూరం హెచ్చుస్థాయిలో
మరికొంత దూరం మంద్రస్థాయిలో..

ఇవాళ్టిలాగే రేపూ
ఒక అపరిచిత దారిలో ప్రయాణమని తెలుసు
అయితే,
రేపొక మోదుగుచెట్టు కనిపించవచ్చని ఊహిస్తున్నాను.

2 comments:

బుచికి said...

బాగా వ్రాస్తున్నావు బయ్యా. బాగుంది. బివివి ప్రసాద్ గారి రచనలు విరివిగా చదివితే ఏమి రాయాలో ఇంకా బాగా తెలుస్తుంది. No doubt you are showing promise.

Unknown said...


viagra
obat kuat viagra